చూచిరాతపై ఉపాధ్యాయుడి దండింపు.. ఉరేసుకున్న 7వ తరగతి విద్యార్థి

ఉపాధ్యాయుడు తనపై చేయిచేసుకున్నారని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఉరేసుకుని మృతి చెందిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది. జవహర్‌ విహార్‌ కాలనీకి చెందిన యష్‌

Published : 24 Sep 2022 09:30 IST

ఉపాధ్యాయుడు తనపై చేయిచేసుకున్నారని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఉరేసుకుని మృతి చెందిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది. జవహర్‌ విహార్‌ కాలనీకి చెందిన యష్‌ రతపూర్‌లోని సెయింట్‌ పీటర్స్‌ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం బయాలజీ పరీక్షకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతను చూచిరాతకు పాల్పడుతున్నట్లు టీచరు గుర్తించారు.  అతనిపై చేయి చేసుకున్న ఆయన తోటి విద్యార్థుల ముందు అవమానించారు. ఆపై యష్‌ను  ప్రిన్స్‌పల్‌ కార్యాలయానికి తీసుకువెళ్లారు. దీంతో ఆ విద్యార్థి మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికి చేరుకున్న అతను మధ్యాహ్న భోజనం కూడా చేయలేదు. చివరికి తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. పోలీసులు యష్‌ రాసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ‘‘బయాలజీ పరీక్షలో నేను మోసానికి పాల్పడ్డాను. నేను మరణిస్తున్నాను. ఎవరైనా తప్పు చేస్తే వారికి మరో అవకాశం ఇవ్వాలి. నేను చేసిన తప్పునకు ఎంతో రోదించాను. నా తోటి విద్యార్థులు నన్ను సిగ్గు-సిగ్గు అంటూ హేళన చేశారు. నా తల్లిదండ్రులకు, స్నేహితులకు క్షమాపణలు చెబుతున్నా’’ అని యష్‌ ఆ లేఖలో పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని