ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో చుక్కెదురు

దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. డిఫాల్ట్‌ బెయిలు కోసం ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

Published : 27 Sep 2022 04:07 IST

ఈనాడు, అమరావతి: దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. డిఫాల్ట్‌ బెయిలు కోసం ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. హత్య కేసులో తనను రిమాండ్‌కు పంపిన 90 రోజుల్లోగా దర్యాప్తు చేసి కింది కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయనందున సీఆర్‌పీసీ సెక్షన్‌ 167(2) ప్రకారం డిఫాల్ట్‌ బెయిలు ఇవ్వాలంటూ అనంతబాబు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై వాదనలు ముగియడంతో తీర్పు వాయిదా పడింది. మరోవైపు తనకు సాధారణ బెయిలు మంజూరు చేయాలని అనంతబాబు వేసిన ఇంకో వ్యాజ్యంపై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని