బస్సు, ట్రక్కు ఢీ.. 10 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు, ప్రైవేటు బస్సు ఢీకొనడం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 41 మంది గాయపడ్డారు. ఖరిమా పోలీస్‌ స్టేషన్‌ పోస్ట్‌ సమీపంలోని శారదా నది వంతెనపై

Updated : 29 Sep 2022 05:08 IST

లఖింపుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు, ప్రైవేటు బస్సు ఢీకొనడం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 41 మంది గాయపడ్డారు. ఖరిమా పోలీస్‌ స్టేషన్‌ పోస్ట్‌ సమీపంలోని శారదా నది వంతెనపై బుధవారం ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ‘‘దసరా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. బస్సులో సుమారు 50 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. బస్సు ధౌరాహరా నుంచి లఖింపుర్‌ ఖేరికి వస్తోంది.. లఖింపుర్‌ నుంచి భరూచ్‌కు వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఉదయం 7.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది’’ అని పోలీసులు పేర్కొన్నారు. ఘటన గురించి సమాచారం అందగానే పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జిల్లా మేజిస్ట్రేట్‌ మహేంద్ర బహదూర్‌ సింగ్‌ సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని