కారులో జంట ఆత్మహత్యాయత్నం

ఓ యువతి, యువకుడు నిద్ర మాత్రలు మింగి కారులో ఆత్మహత్యకు యత్నించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో యువకుడు మృతిచెందగా యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Published : 07 Oct 2022 02:31 IST

యువకుడు మృతి, చికిత్స పొందుతున్న యువతి

మంత్రాలయం, న్యూస్‌టుడే:  ఓ యువతి, యువకుడు నిద్ర మాత్రలు మింగి కారులో ఆత్మహత్యకు యత్నించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో యువకుడు మృతిచెందగా యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్సై వేణుగోపాల్‌ రాజు వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా ఉలవలపాడు గ్రామానికి చెందిన వేణు(32), ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఓ యువతి ఈ నెల 4న ఉదయం 9.30 గంటలకు కర్నూలు జిల్లా మంత్రాలయానికి కారులో చేరుకున్నారు. అక్కడి పార్కింగ్‌ స్థలంలో కారు ఉంచారు. ఇద్దరూ నిద్ర మాత్రలు మింగి కారు డోర్లను లాక్‌ చేసుకున్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో యువతి వాంతులు చేసుకున్నారు. ఆ సమయంలో డోర్‌ తీయడంతో అక్కడే ఉన్న మఠం సెక్యూరిటీ గార్డు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా అప్పటికే వేణు(32) మృతిచెందారు. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఆ యువతి కనిపించడం లేదని ఈ నెల 4న కుటుంబ సభ్యులు ప్రకాశం జిల్లా దర్శి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు విచారణలో వెల్లడైంది. మృతుడికి ఇది వరకే వివాహమై భార్య, ఇద్దరు పిల్లలున్నారని పోలీసులు గుర్తించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts