పునాది గోతిలో పడి బాలుడి మృతి

ఇంటి వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు సామాజిక భవన నిర్మాణం పునాదుల కోసం తవ్విన గోతిలో పడి మృతిచెందాడు.

Published : 08 Oct 2022 04:24 IST

సీతానగరం, న్యూస్‌టుడే: ఇంటి వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు సామాజిక భవన నిర్మాణం పునాదుల కోసం తవ్విన గోతిలో పడి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన జామి ఏసు, స్వర్ణకుమారిల కుమారుడు రాజేష్‌(4) శుక్రవారం ఉదయం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం వరకు రాకపోవడంతో సమీపంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడని భావించారు. అక్కడా కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతకగా సామాజిక భవన నిర్మాణానికి తీసిన గోతుల్లోని నీటిలో అతడి శవం కనిపించింది. గోతుల వద్ద ఎటువంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడం వల్లనే బాలుడు మృతి చెందాడని బాధితులు ఆందోళనకు దిగారు. రోడ్డు పక్కనే గోతులు తీసి వదిలేయడం దారుణమని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని