వీఆర్వోపై దాడికి వైకాపా నేత యత్నం

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పిచ్చినాయుడుపల్లి వీఆర్వోపై అదే పంచాయతీకి చెందిన శివకోటి దాడికి యత్నించి ఫోన్‌ లాక్కొని దూషించారు.

Published : 30 Nov 2022 06:15 IST

చంద్రగిరి, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పిచ్చినాయుడుపల్లి వీఆర్వోపై అదే పంచాయతీకి చెందిన శివకోటి దాడికి యత్నించి ఫోన్‌ లాక్కొని దూషించారు. ఈ విషయాన్ని తహసీల్దారు దృష్టికి వీఆర్వో తీసుకెళ్లి.. అనంతరం మంగళవారం రాత్రి శివకోటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు.. విధినిర్వహణలో భాగంగా వీఆర్వోలు అశోక్‌కుమార్‌, హరికృష్ణ మంగళవారం శానంబట్ల సమీపంలోని జగనన్న కాలనీకి వెళ్తుండగా పిచ్చినాయుడుపల్లి సమీపంలోని సర్వే నంబరు 1490 ప్రభుత్వ భూమిలో జేసీబీ సాయంతో ఆరు ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా మట్టి తరలిస్తుండగా అడ్డుకున్నారు. వీఆర్వో హరికృష్ణ ఫొటో, వీడియో తీస్తుండగా జేసీబీ డ్రైవరు అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ల యజమాని వైకాపా నాయకుడు శివకోటికి సమాచారం అందించారు. ఆయన అక్కడకు చేరుకుని వీఆర్వో సెల్‌ఫోన్‌ లాక్కుని దుర్భాషలాడుతూ ‘నీకు దిక్కున్నచోట చెప్పుకో’ అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని