శ్రద్ధాను చంపినందుకు నేనేం బాధపడట్లేదు

సంచలనం సృష్టించిన కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ ఆమిన్‌ పూనావాలాకు ఇటీవల పాలిగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించారు.

Published : 01 Dec 2022 04:51 IST

పాలిగ్రాఫ్‌ టెస్టులో ఆఫ్తాబ్‌..

దిల్లీ: సంచలనం సృష్టించిన కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ ఆమిన్‌ పూనావాలాకు ఇటీవల పాలిగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించారు. కాగా.. ఈ టెస్టులో ఆఫ్తాబ్‌ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. పాలిగ్రాఫ్‌ టెస్టు సమయంలో శ్రద్ధాను తానే హత్య చేశానని.. అందుకు తనకేమీ పశ్చాత్తాపం లేదని, బాధ పడటం లేదని చెప్పినట్లు దర్యాప్తు బృందం వర్గాలు వెల్లడించాయి. హత్య తర్వాత శ్రద్ధాను ముక్కలు చేసి ఆమె శరీర భాగాలను అడవిలో పడేసిన విషయాన్ని కూడా ఆఫ్తాబ్‌ పాలిగ్రాఫ్‌ సెషన్‌లో చెప్పినట్లు తెలిసింది. తనకు చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని నిందితుడు అంగీకరించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. పాలిగ్రాఫ్‌ పరీక్షల సమయంలో ఆఫ్తాబ్‌ ప్రవర్తన చాలా సాధారణంగా ఉందట. శ్రద్ధ హత్యకు సంబంధించిన అన్ని వివరాలను తాను ఇప్పటికే పోలీసులకు చెప్పానని నిందితుడు పదేపదే చెప్పినట్లు సమాచారం.  శ్రద్ధాను హత్య చేసినట్లు ఆఫ్తాబ్‌.. ఆ మధ్య కోర్టు ముందు కూడా అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు.. ఆఫ్తాబ్‌కు నార్కో పరీక్ష జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ పరీక్ష కోసం  దరఖాస్తు చేసుకోగా.. కోర్టు అందుకు అనుమతినిచ్చింది. డిసెంబరు 1, 5 తేదీల్లో దిల్లీలోని రోహిణి ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీలో నార్కో పరీక్ష నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని