Hyderabad Begging Mafia: హైదరాబాద్‌లో బెగ్గింగ్‌ మాఫియా.. వృద్ధులకు రోజుకు రూ.200 ఇచ్చి..

హైదరాబాద్‌లో బెగ్గింగ్‌ రాకెట్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఛేదించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, కేబీఆర్‌ పార్క్‌ వద్ద 23 మందిని అరెస్ట్ చేశారు.

Updated : 18 Aug 2023 12:11 IST

హైదరాబాద్‌: నగరంలో బెగ్గింగ్‌ రాకెట్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, కేబీఆర్‌ పార్క్‌ వద్ద 23 మంది యాచకులను అరెస్ట్ చేశారు. వీరితో  భిక్షాటన చేయిస్తున్న  బెగ్గింగ్‌ మాఫియా నిర్వాహకుడు అనిల్‌ పవార్‌ను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 23 మంది బిచ్చగాళ్లను రెస్క్యూహోంకు తరలించినట్లు వివరించారు. నిర్వాహకుడిపై భిక్షాటన నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు.

భార్యపై అనుమానంతో ఉన్మాదిలా మారి.. వేటకొడవలితో వీధుల్లో వీరంగం

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెగ్గింగ్‌ నిర్వాహకుడు అనిల్‌ వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులను తీసుకొచ్చి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పరిసర ప్రాంతాల్లో వారితో బెగ్గింగ్‌ చేయిస్తున్నాడు. యాచకులందరి నుంచి రోజుకు రూ.4,500 నుంచి రూ.6,000 వరకు తీసుకుంటాడు. దీనికి  ప్రతిగా ఒక్కో బిచ్చగాడికి రోజుకు రూ.200 కూలిగా చెల్లిస్తున్నాడు. సిగ్నల్స్ వద్ద భిక్షాటనతో ఇబ్బందులకు గురైనవారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ఈ బెగ్గింగ్‌ రాకెట్‌ను చేధించాం. మరికొద్ది రోజుల పాటు ఈ డ్రైవ్‌ కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని