స్థిరాస్తి సంస్థలపై ఐటీ దాడులు.. లెక్కల్లో చూపని రూ.400 కోట్లు గుర్తింపు

దిల్లీ కేంద్రంగా స్థిరాస్తి కార్యకలాపాలు సాగిస్తున్న రెండు సంస్థలు.. రూ.400 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ శాఖ గుర్తించింది.

Updated : 24 Nov 2021 22:22 IST

దిల్లీ: దిల్లీ కేంద్రంగా స్థిరాస్తి కార్యకలాపాలు సాగిస్తున్న రెండు సంస్థలు.. రూ.400 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ శాఖ గుర్తించింది. పన్ను ఎగవేతకు సంబంధించి ఈ నెల 17న సదరు స్థిరాస్తి సంస్థల కార్యాలయాల్లో అధికారులు దాడులు నిర్వహించి.. లెక్కల్లో చూపని రూ.10 కోట్లను జప్తు చేశారు. దాదాపు రూ.400 కోట్లు లెక్కల్లో చూపలేదని సోదాల్లో స్వాధీనం చేసుకున్న దస్త్రాల ఆధారంగా గుర్తించారు.

Read latest Crime News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని