
Updated : 17 Jan 2022 07:22 IST
Crime News: కొడుకును కాపాడబోయి... అతనితోపాటు తల్లీ మృతి
గుడిపాల, న్యూస్టుడే: నీటిలో మునిగిపోతున్న తనయుడిని కాపాడబోయి అతనితోపాటు తల్లి కూడా మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపారలో ఆదివారం జరిగింది. స్థానికురాలైన కవిత(35) తన మతిస్థిమితం లేని కొడుకు డిల్లీ(15)ని తీసుకుని దుస్తులు ఉతికేందుకు ఇంటికి సమీపంలోని అప్పాయగుంటకు వెళ్లింది. ప్రమాదవశాత్తూ కుమారుడు కాలుజారి నీటిలో పడిపోగా కాపాడేందుకు ఆమె చెరువులోకి దిగింది. అతడు తల్లిని గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరూ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ దుస్తులు ఉండటం, వారు కనిపించక పోవడంతో అనుమానంతో చెరువులో వెతకగా మృతదేహాలు దొరికాయి. దీనిపై పోలీసులకు రాత్రి పొద్దుపోయే వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
Advertisement
Tags :