విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టిన ట్యూటర్‌!

బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు ఓ ట్యూటర్‌ని అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని పార్గనాస్‌లో సదరు ట్యూటర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి మిత్రుడి కోసం గాలిస్తున్నారు...

Published : 12 Oct 2020 19:20 IST

కోల్‌కతా: బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు ఓ ట్యూటర్‌ని అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని పార్గనాస్‌లో సదరు ట్యూటర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి మిత్రుడి కోసం గాలిస్తున్నారు. ట్యూషన్‌కి వెళ్లిన తనపై కొద్దిరోజుల క్రితం ట్యూటర్‌ సహా అతడి మిత్రుడు అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ ఘటనను వీడియో తీశారని ఓ 14 ఏళ్ల బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్యూటర్‌ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కాగా న్యాయస్థానం అతడికి ఏడు రోజుల కస్టడీ విధించింది. అతడి మిత్రుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. బాలిక వైద్య నివేదిక రావాల్సి ఉందని తెలిపారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని