Crime news: బాలికపై అత్యాచారం.. 80 ఏళ్ల వృద్ధుడికి 45 ఏళ్ల జైలు

బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ వృద్ధుడి (80)కి కేరళ కోర్టు  45 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Published : 22 Feb 2024 19:58 IST

తిరువనంతపురం: బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో 80 ఏళ్ల వృద్ధుడికి కేరళ (Kerala) కోర్టు మొత్తం 45 ఏళ్లు జైలు శిక్ష విధించింది. రూ.60 వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వివరాల ప్రకారం.. తండ్రి మరణించడం, తల్లి విడిచిపెట్టి వెళ్లిపోవడంతో ఓ బాలిక (14) తన బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందింది. ఆ నివాసానికి సమీపంలోనే ఓ వృద్ధుడు  దుకాణం నిర్వహించేవాడు. ఎవరూ లేని సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

సందేశ్‌ఖాలీ బాధిత మహిళలతో ప్రధాని మోదీ భేటీ..!

2021కు సంబంధించిన ఈ కేసుపై విచారణ చేపట్టిన ఇడుక్కి ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి టీజీ వర్గీస్.. అతడిని దోషిగా తేల్చారు. పోక్సో చట్టం కింద వేర్వేరు నేరాలకు కలిపి మొత్తం 45 ఏళ్ల జైలు శిక్ష విధించారు. వాటిని ఏకకాలంలో అమలుచేయాలని తీర్పు చెప్పారు. గరిష్ఠంగా 20 ఏళ్ల శిక్ష పడటంతో.. ఆ మేరకు అనుభవించాల్సి ఉంటుందని ఎస్‌పీపీ తెలిపారు. రూ.60 వేల జరిమానా బాధితురాలికి చెల్లించాలని, ఆమె పునరావాసం కోసం రూ.50 వేలు ఇవ్వాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని