Crime news: అదర్ పూనావాలా ఫొటోతో చీటింగ్.. డబ్బు కాజేసిన కేసులో ఏడుగురి అరెస్టు
మహారాష్ట్రలోని పుణెకు చెందిన వ్యాక్సిన్ల తయారీ కంపెనీ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII) సీఈవో అదర్ పునావాలా ఫొటోతో చీటింగ్‌కు పాల్పడిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
పుణె: మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ కంపెనీ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII) సీఈవో అదర్ పునావాలా ఫొటోతో చీటింగ్‌కు పాల్పడిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం పునావాలా ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని ఆ కంపెనీకి చెందిన ఓ డైరెక్టర్ నుంచి రూ.కోటి కాజేసిన ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. బండ్‌గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో సెప్టెంబర్ రెండో వారంలో ఈ కేసు నమోదైనట్టు తెలిపారు. పునావాలా ఫొటోను నిందితుడు తన వాట్సాప్ ఖాతాకు వాడి.. ‘సీరమ్’ సంస్థ డైరెక్టర్లలో ఒకరైన సతీశ్ దేశ్‌పాండేతో చాటింగ్ చేశాడని.. డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు పెట్టినట్టు పేర్కొన్నారు. అయితే, ఆ మెసేజ్‌లన్నీ పునావాలా నుంచే వచ్చాయని నమ్మిన డైరెక్టర్ నిందితుడు వాట్సాప్ చాటింగ్‌లో పేర్కొన్న ఎనిమిది బ్యాంకు ఖాతాల్లోకి రూ.1.01 కోట్లను బదిలీ చేశారన్నారు.
ఈ బ్యాంకు ఖాతాలు ఎనిమిది మందికి చెందినవిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఏడుగురిని వేర్వేరు రాష్ట్రాల్లో అరెస్టు చేయగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్టు జోన్-II డిప్యూటీ పోలీస్ కమిషనర్ స్మార్థన పాటిల్ వెల్లడించారు. ఈ ఎనిమిది ఖాతాల నుంచి డబ్బులు బదిలీ అయిన 40ఖాతాలను సీజ్ చేసినట్టు తెలిపారు. అలాగే, రూ.13లక్షలు జప్తు చేశామన్నారు. నిందితులంతా బిహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని.. వీరంతా బీటెక్, బీఎస్సీ గ్రాడ్యుయేషన్ చదివారని డీసీపీ వివరించారు. వీరిలో ఒకడు ఓ కమర్షియల్ బ్యాంకులో పనిచేస్తున్నట్టు గుర్తించామన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సీరమ్ సంస్థ కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Pathaan: ‘వైఆర్‌యఫ్ స్పై యూనివర్స్’లో ‘పఠాన్’ నంబరు 1.. కలెక్షన్ ఎంతంటే?
-
India News
Job vacancies: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79లక్షల ఉద్యోగ ఖాళీలు.. పోస్టుల జాబితా ఇదే..!
-
India News
US Visa: వీసా రెన్యువల్‌కు నో మెయిల్.. ఓన్లీ డ్రాప్ బాక్స్!
-
General News
Ap Highcourt: ప్రభుత్వ సలహాదారులను నియమించుకుంటూ పోతే ఎలా?: ఏపీ హైకోర్టు
-
Sports News
IND vs AUS:రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉండటం భారత్‌కు చాలాముఖ్యం: ఆకాశ్ చోప్రా
-
General News
Andhra News: అవసరమైతే మరోసారి గవర్నర్‌ను కలుస్తాం: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ