ప్రకాశం జిల్లాలో దారుణం.. పోలీస్‌ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఎస్సీ యువకుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది.

Published : 06 Dec 2023 22:10 IST

యర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఎస్సీ యువకుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బాధితుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. సంబంధం లేని కేసులో పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి, పోలీసులు కొట్టారని మనస్తాపానికి గురైన మోజేసు అనే యువకుడు బుధవారం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

యువకుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, మోజేసు ఆత్మహత్యాయత్నానికి కారణమైన పోలీసులపై తక్షణమే చర్య తీసుకోవాలని యర్రగొండపాలెం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైకాపా పాలనలో దళితులకు రక్షణ లేదని, బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకుడు ఎరిక్సన్‌ బాబు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు