Updated : 06/11/2021 07:09 IST

Crime News: యువతి దుస్తులు మార్చుకుంటుండగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ

జూబ్లీహిల్స్‌లోని వస్త్ర దుకాణంలో ఘటన
ఇద్దరు విద్యార్థుల అరెస్టు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: వస్త్ర దుకాణం ట్రయల్‌రూంలో యువతి దుస్తులు మార్చుకుంటుండగా సెల్‌ఫోన్‌తో చిత్రీకరించిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌చేశారు. జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36/10లో అల్కజార్‌ మాల్‌లో హెచ్‌అండ్‌ఎం స్టోర్‌ ఉంది. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన యువతి కొనుగోలుచేసిన దుస్తులు సరిచూసుకునేందుకు ట్రయల్‌రూంలోకి వెళ్లారు. అక్కడే దుస్తులు కొనుగోలు చేయడానికి వచ్చిన సీఏ విద్యార్థి కిరీట్‌ అసత్‌, ఇంటర్‌ చదువుతున్న గౌరవ్‌ కల్యాణ్‌ పక్కనే ఉన్న మరో ట్రయల్‌రూంలోకి వెళ్లారు. రెండు గదుల మధ్య అసంపూర్తిగా అమర్చిన చెక్కల ఖాళీ ప్రదేశంలో సెల్‌ఫోన్‌ ఉంచి వీడియో చిత్రీకరించడాన్ని యువతి గమనించి కేకలు వేశారు. దుకాణం సిబ్బంది ఇద్దర్నీ పట్టుకుని ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. యువతి ఆగ్రహంతో వారికి దేహశుద్ధి చేయడంతోపాటు, ఫోన్‌లోని వీడియోలను తొలగించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ‘ఫిర్యాదు చేయడానికి యువతి ముందుకు రాకపోవడంతో సుమోటోగా కేసు నమోదు చేసి ఇద్దర్నీ రిమాండ్‌కు తరలించామని, వినియోగదారులకు రక్షణ కల్పించడంలో విఫలమైన స్టోర్‌ మేనేజర్‌ అమన్‌సూరిపైనా కేసు నమోదు చేశామని’ ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని