Viveka Murder Case: కడప నుంచి పులివెందులకు వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 114వ రోజు కొనసాగుతోంది. కడపలోని కేంద్ర కారాగారం అతిథి గృహంలో ..

Published : 29 Sep 2021 12:48 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 114వ రోజు కొనసాగుతోంది. కడపలోని కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా ఇవాళ వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అతడిని కడప నుంచి పులివెందుల తీసుకెళ్లారు. ఇప్పటికే పలుమార్లు దస్తగిరిని విచారించిన అధికారులు మరోసారి విచారణకు పిలిచారు. నిన్న వేముల జడ్పీటీసీ సభ్యుడు వెంకట బయపురెడ్డిని సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డికి వెంకట బయపురెడ్డి అనుచరుడని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని