cheating: పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడదామని రూ. 22 లక్షల మోసం 

పెళ్లి పేరుతో ఓ యువతిని నమ్మించి ఓ వ్యక్తి రూ. 22 లక్షలు మోసం చేశాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Updated : 02 Sep 2021 07:36 IST

హైదరాబాద్‌: పెళ్లి పేరుతో ఓ యువతిని నమ్మించి ఓ వ్యక్తి రూ. 22 లక్షలు మోసం చేశాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పెళ్లి కోసం ఓ మ్యాట్రిమోనీ సైట్‌లో రిజిస్టర్‌ అయింది. తాను కూడా అదే సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్న బాల వంశీకృష్ణ అనే వ్యక్తి తాను అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను అని చెప్పి ఆ యువతికి పరిచయమయ్యాడు. ఓ కంపెనీలో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్నట్లు నమ్మబలికాడు. అమెరికాకు వస్తే ఇక్కడే పెళ్లి చేసుకొని స్థిర పడదామని యువతిని నమ్మించాడు. వీసా కోసం బ్యాంకు బ్యాలెన్స్‌ చూపించాలంటూ యువతి వద్ద ఉన్న రూ.22.70 లక్షలను తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. అనంతరం వంశీకృష్ణ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఇదే తరహాలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో బాల వంశీకృష్ణ మరో యువతిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని