Hyderabad news: పూజారినంటూ బంగారం, వెండి ఆభరణాలతో ఉడాయింపు

పూజారినంటూ గుర్తుతెలియని వ్యక్తి మహిళను మోసం చేసి బంగారం, వెండి ఆభరణాలతో ఉడాయించాడు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా

Updated : 03 Aug 2021 16:51 IST

హైదరాబాద్: పూజారినంటూ గుర్తుతెలియని వ్యక్తి మహిళను మోసం చేసి బంగారం, వెండి ఆభరణాలతో ఉడాయించాడు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్‌ 14లో నివాసముంటున్న ఓ మహిళ ఇంటికి గత నెల 31న ఉదయం 9గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తననుతాను పూజారిగా పరిచయం చేసుకున్నాడు. ఆమె ఇంటికి సమీపంలోనే పనిచేస్తున్నానంటూ నమ్మించాడు. పూజ కోసం మామిడి ఆకులు కావాలని ఆమెతో మాటలు కలిపాడు.

దేవుడికి బంగారు, వెండి ఆభరణాలతో పూజలు చేస్తే జీవితంలో మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో రూ.2.90 లక్షల విలువైన మూడు తులాల బంగారు గొలుసు, బంగారు నెక్లెస్‌, 17 తులాల వెండి ఆభరణాలను నిందితుడికి ఇచ్చేసింది. పూజలు చేసిన తర్వాత తిరిగి తీసుకొస్తానని చెప్పి వెళ్లిపోయిన నిందితుడు ఎంతకూ తిరిగి రాలేదు. ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన రేణుక పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని