Crime News: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనుమానాస్పద మృతి

ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

Published : 10 Oct 2021 10:14 IST

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ వివరాల ప్రకారం..సికింద్రాబాద్‌ మౌలాలి హెచ్‌బీకాలనీకి చెందిన వి.శ్రీకాంత్‌(49) బెంగళూరులోని కాగ్నిజెంట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 2007లో వివాహమైన మూడు నెలలకే అతను మధుమేహంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్న శ్రీకాంత్‌ మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 3న నగరానికి వచ్చిన శ్రీకాంత్‌ డైమండ్‌ పాయింట్‌ చౌరస్తాలోని అతిథి గెస్ట్‌హౌజ్‌లో ఉంటున్నాడు. బంధువు శ్రీనివాస్‌ భోజనం తెస్తున్నారు. రోజులాగే శ్రీనివాస్‌ శనివారం మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చాడు. ఎంత తట్టినా శ్రీకాంత్‌ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి నిర్వాహకులకు విషయం చెప్పాడు. వారు వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి శ్రీకాంత్‌ అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. 108 సిబ్బంది శ్రీకాంత్‌ను పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. శ్రీకాంత్‌ మృతిపై అనుమానం వ్యక్తంచేస్తూ అతని తమ్ముడు నవీన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని