ATM సెంటర్‌ పేల్చేసి.. ₹28లక్షలతో పరార్‌!

పేలుడు పదార్థాలు ఉపయోగించి ఏటీఎం యంత్రాన్ని పేల్చేసి దాదాపు రూ.28 లక్షల నుంచి రూ.30లక్షల వరకు దోచుకెళ్లినట్టు డిప్యూటీ కమిషనర్‌.....

Updated : 22 Jul 2021 03:23 IST

పుణె: మహారాష్ట్రలోని పుణె నగరంలో ఆగంతకులు రెచ్చిపోయారు. తెల్లవారు జామున ఏటీఎం కేంద్రంపై పడి భారీ నగదుతో పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ ఏటీఎం కేంద్రం వద్ద ఇద్దరు దుండగులు పేలుళ్లకు పాల్పడి డబ్బును దోచుకొని ఉడాయించినట్టు గుర్తించామని పింప్రీ చించ్వాడ్‌ పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలు ఉపయోగించి ఏటీఎం యంత్రాన్ని పేల్చేసి దాదాపు రూ.28 లక్షల నుంచి రూ.30లక్షల వరకు దోచుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. దీంతో  పోలీసు బృందం అక్కడికి చేరుకొని నమూనాలను సేకరించిందని, ఇందులో ఎలాంటి పేలుడు పదార్థాలు వాడారో తెలుసుకోనున్నట్టు చెప్పారు. ఈ పేలుడుకు టీఎన్‌టీ డిటోనేటర్లు, జిలెటిన్‌ స్టిక్స్‌ లేదా ఇంకేమైనా పేలుడు పదార్థాలు వాడారో ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. సీసీటీవీ ఫుటేజీలో మాత్రం ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. అయితే, తీసుకెళ్లే సమయంలేకపోవడంతో దాదాపు రూ.10లక్షలు అక్కడే వదిలిపారిపోయినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని