Robbery: జనాభా లెక్కల అధికారులమని చెప్పి ఇంటిని దోచేశారు..

మహారాష్ట్రలోని అమరావతిలో ఇద్దరు వ్యక్తులు తాము జనాభా లెక్కల కోసం వచ్చామని మహిళను నమ్మించి దొంగతనం చేశారు. 

Updated : 31 Jan 2024 08:03 IST

అమరావతి: జనాభా లెక్కల సర్వేయర్లుగా నమ్మించిన ఇద్దరు వ్యక్తులు పట్టపగలే ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతిలో చోటుచేసుకుంది. రాఠి నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు వచ్చిన ఇద్దరు దొంగలు తాము జనాభా లెక్కల గురించి సర్వే చేస్తున్నట్లు ఒంటరిగా ఉన్న మహిళను నమ్మించారు. ఆధార్‌ కార్డు తీసుకురావాలని చెప్పడంతో ఆమె ఇంట్లోకి వెళ్లింది. వెనకే వెళ్లిన వారు గది తలుపువేసి ఆమెను బంధించారు. కత్తితో బెదిరించి రూ.5లక్షలతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని