ఉపాధి అధికారిపై సర్పంచ్‌ పెట్రోల్‌ దాడి

నిర్మల్‌లో ఉపాధి హామీ అధికారిపై సర్పంచ్‌ పెట్రోల్‌తో దాడి చేయడం కలకలం రేగింది. జిల్లాలోని కుబీర్‌లో అధికా..రి

Updated : 14 Jul 2021 05:37 IST

నిర్మల్‌: నిర్మల్‌లో ఉపాధి హామీ అధికారిపై సర్పంచ్‌ పెట్రోల్‌తో దాడి చేయడం కలకలం రేగింది. జిల్లాలోని కుబీర్‌లో అధికారి రాజుపై పాతసాల్వి గ్రామ సర్పంచ్‌ సాయినాథ్‌ పెట్రోల్‌తో దాడి చేసి నిప్పంటించాడు. అక్కడే ఉన్న ఇతర సిబ్బంది స్పందించి రాజుపై బకెట్లతో నీళ్లు పోశారు. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని దస్త్రాలు కాలిపోయాయి. గాయాలపాలైన రాజును చికిత్స నిమిత్తం భైంసాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సర్పంచ్‌తో పాటు అధికారి రాజు వేర్వేరుగా కుభీర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని