logo

సమగ్ర యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు

మిరపలో సమగ్ర యాజమాన్య పద్ధతులతో దిగుబడులు పెంచుకోవచ్చని విజయవాడ శాస్త్రవేత్తలు డాక్టరు వీరబాబు, ప్రేమ రంజిత చెప్పారు. మిరపలో సమగ్ర సస్యరక్షణ చర్యలపై బుధవారం గుత్తికొండలో రైతులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ

Published : 20 Jan 2022 04:27 IST


మాట్లాడుతున్న వీరబాబు

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: మిరపలో సమగ్ర యాజమాన్య పద్ధతులతో దిగుబడులు పెంచుకోవచ్చని విజయవాడ శాస్త్రవేత్తలు డాక్టరు వీరబాబు, ప్రేమ రంజిత చెప్పారు. మిరపలో సమగ్ర సస్యరక్షణ చర్యలపై బుధవారం గుత్తికొండలో రైతులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ మిరపపంటపై తామర పురుగుతో రైతులు నష్టపోయారని, సుస్థిర వ్యవసాయం చేయాలంటే నేల సారవంతాన్ని పదిలంగా ఉంచుకోవాలని సూచించారు. చీడపీడల నుంచి సమగ్ర యాజమాన్యం పద్ధతులు ఆచరించాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ దక్షిణామూర్తి, ఉద్యానవనశాఖ గుంటూరు ఉపసంచాలకులు సుజాత, సంచాలకులు బెన్ని, పిడుగురాళ్ల ఉద్యానవన అధికారి వై.మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని