logo

తొలి రోజు 1,011 మంది గృహ ఓటింగ్‌

కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు రెండు రోజుల పాటు ఓటింగ్‌ చేసుకునే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది.

Published : 04 May 2024 04:46 IST

ఇంటి నుంచే ఓటు వేస్తున్న వృద్ధురాలు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ రాత్రి వరకు సాగింది. జిల్లాలో 2 వేల మందికి పైగా ఓటర్లు హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,011 మంది శుక్రవారం ఓటు వేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో రిటర్నింగ్‌ అధికారి సూచనలతో ఏర్పాటు చేసిన కమిటీలు ఈ ఓటింగ్‌ ప్రక్రియను నిర్వహించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని