logo

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రలోభాలు

జీతభత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ బాధ్యతల నిర్వహణతోపాటు వివిధ అంశాల్లో ఐదేళ్లు రాచిరంపాన పెట్టడంతో వైకాపా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తల్ని ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

Published : 04 May 2024 05:33 IST

పోస్టల్‌ బ్యాలెట్‌కు రూ.3 వేలు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: జీతభత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ బాధ్యతల నిర్వహణతోపాటు వివిధ అంశాల్లో ఐదేళ్లు రాచిరంపాన పెట్టడంతో వైకాపా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తల్ని ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల వినియోగానికి ఉద్యోగులు సిద్ధమవుతున్న వేళ వారికి నగదు ఎరగా వేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పొందిన నియోజకవర్గ పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తల వివరాలతో మండలాల వారీగా వారికి నగదు చేరవేస్తున్నారు. దీనికి ఏ మండలానికి ఆ మండల బాధ్యతల్ని స్థానిక వైకాపా నాయకుడితోపాటు కొందరు గురువులు, ఉద్యోగులకు అప్పగించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఉన్న వారికి ఫోన్‌చేసి వైకాపాకు అనుకూలంగా ఓటెయ్యాలని కోరుతున్నారు. సానుకూలంగా స్పందిస్తే ఫోన్‌పే నంబరు తీసుకుని వెంటనే రూ.3 వేలు నగదు పంపిస్తున్నారు. ప్రతికూలంగా ఉన్నాసరే ముందు నగదు తీసుకోండి.. తరువాత ఆలోచించి నిర్ణయం తీసుకోండంటూ ఎర వేస్తున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల, సత్తెనపల్లి మండలాలు, పట్టణంలో శుక్రవారం ఎక్కువమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నగదు చేరవేశారు. జేబుల్లో నగదుతో తిరిగితే ఎంసీసీ బృందాలు పట్టుకుంటాయనే కారణంతో డిజిటల్‌ లావాదేవీలతో ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని