logo

372 సమస్యాత్మక కేంద్రాలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి 373 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 1,309 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

Published : 04 May 2024 05:26 IST

1,309 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, పక్కన అభ్యర్థులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి 373 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 1,309 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లోని వీసీ హాలులో శుక్రవారం ఈవీఎంల అదనపు కేటాయింపు ప్రక్రియపై పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గుంటూరు పార్లమెంట్‌కు వినియోగించే బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌, వీవీప్యాట్‌ యూనిట్లను మొదటి ర్యాండమైజేషన్‌ ద్వారా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించామన్నారు. ఇప్పుడు రెండో ర్యాండమైజేషన్‌ ద్వారా పోలింగ్‌ బూత్‌లకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఆయా వివరాలను పోటీలో ఉన్న అభ్యర్థులకు ఇచ్చామని చెప్పారు. అభ్యర్థులు వారి ఖర్చుల వివరాలను కలెక్టరేట్‌లోని శంకరన్‌ హాలు వద్ద వ్యయ పరిశీలకులకు అందించాలన్నారు. గుంటూరు పార్లమెంట్‌ పోస్టల్‌ బ్యాలట్‌కు సంబంధించిన ఓట్లను కలెక్టరేట్‌లో భద్రపరిచినట్లు తెలిపారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు కార్తీకా, నీరజ్‌కుమార్‌, పార్లమెంట్‌ నియోజకవర్గ పోలీస్‌ పరిశీలకులు సత్యరత్‌అనురుథ్‌ పంకజ్‌, పార్లమెంట్‌ నియోజకవర్గ వ్యయ పరిశీలకుడు మ్రిణల్‌ కుమార్‌దాస్‌, వ్యయ పరిశీలకులు రాధానాథ్‌ పురోహిత్‌, ఎర్నే వినోద్‌కుమార్‌ చంద్రాబాన్‌, శిక్షణ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, పార్లమెంట్‌ నియోజకవర్గ ఏఆర్వో బీమారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని