logo

మంగమఠంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

జిల్లా కేంద్రంలోని మంగమఠం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో గురువారం 108 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు.

Published : 23 May 2024 11:12 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని మంగమఠం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో గురువారం 108 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు దుబే వైభవ శర్మ, బ్రహ్మ చైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని వేడుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వామన్ రావు, శ్రీవారి సేవాసమితి బాధ్యులు ఆర్.లచ్చయ్య, సేవకులు సాగర్, పి.లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని