logo

జెండా ఎగరేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు అవుతోంది. దీనిని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను దేశమంతా ఘనంగా జరపుకొంటున్నాం. ఇందులో భాగంగా ప్రతీ ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయాలని ప్రభుత్వం సూచించడంతో జాతీయ జెండాలు ఇంటిపై రెపరెపలాడుతున్నాయి.

Updated : 15 Aug 2022 06:07 IST


ఓ ఇంటిపై రెపరెపలాడుతూ..

దండేపల్లి : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు అవుతోంది. దీనిని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను దేశమంతా ఘనంగా జరపుకొంటున్నాం. ఇందులో భాగంగా ప్రతీ ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయాలని ప్రభుత్వం సూచించడంతో జాతీయ జెండాలు ఇంటిపై రెపరెపలాడుతున్నాయి. అయితే జాతీయ జెండా ఎగురవేసే సమయంలో.. తర్వాత జెండాను భద్రపరిచే విషయంలో ప్లాగ్‌ కోడ్‌ ఆఫ్‌ ఇండియా చట్టం ప్రకారం కొన్ని నిబంధనలున్నాయి. జాతీయ జెండాను అవమానించితే కనీసం మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

ఎగురవేసే సమయంలో..
* జెండాను ఎగురవేసే సమయంలో చిరిగిపోకుండా, నలిగి పోకుండా చూసుకోవాలి.
* దీనిపై ఎలాంటి రాతలు ఉండకూడదు. ఎగువన కాషాయ రంగు.. దిగువన ఆకుపచ్చ రంగు ఉండేలా చూసుకోవాలి.
* దీనితో సమాన లేదా ఎత్తులో మరే జెండా ఉండకూడదు.

దించిన తర్వాత...
* జెండాను ఇళ్లలో ఇతర వస్తువులు, సామగ్రిపై కప్పకూడదు.
* నీటిపై తేలియాడనీయకూడదు.
* ఇంటిలో కాని బయట కాని దారి, కాలిబాటలో పడవేయకూడడు.
* దుస్తులు కుట్టించుకోవడం, అలంకరణ, ఇతర అవసరాలకు దీనిని వినియోగించకూడదు.
* హాని కలిగించే విధంగా ప్రదర్శించకూడదు.
* చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని