logo

పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు

ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది.

Published : 27 Apr 2024 02:12 IST

రామగుండందే పైచేయి.. తరువాతి స్థానంలో ఆదిలాబాద్‌

పోగొట్టుకున్న చరవాణిని సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా గుర్తించి బాధితునికి అందజేస్తున్న సీఐ అశోక్‌

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ నేర విభాగం: ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. వారు ఆ చరవాణి ఎక్కడుందో కనిపెట్టి రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నారు. పోలీసుశాఖ గతేడాది ఏప్రిల్‌ 19న అందుబాటులోకి తీసుకొచ్చిన సీఈఐఆర్‌(సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్‌) పోర్టల్‌ ద్వారా సాధ్యమవుతోంది. ఈ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చి ఏడాది అయిన నేపథ్యంలో పోలీసులు కనుగొన్న చరవాణుల వివరాలతో ‘న్యూస్‌టుడే’ కథనం..

ఎవరైనా చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా పోలీసులకు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. చరవాణికి సంబంధించిన ఈఎంఐ నెంబరు, కంపెనీ పేరు, మోడల్‌, ఫోన్‌ కొనుగోలు చేసిన బిల్లు తదితరాలను అందించాలి. వారు కేసు నమోదు చేస్తారు. అనంతరం ‌్ర్ర్ర.‘’i౯.్ణ్న‌్ర.i-  వెబ్‌సైట్లోకి వెళ్లి అందులో రిక్వెస్ట్‌ ఫర్‌ బ్లాకింగ్‌/స్టోలెన్‌ మొబైల్‌ అనే లింక్‌పై క్లిక్‌ చేసి వివరాలను నమోదు చేస్తారు. వివరాలను అందులో ఎంటర్‌ చేశాక ఓటీపీ కోసం మరో మొబైల్‌ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. తరువాత ఒక ఐడీ నెంబరు వచ్చి మొబైల్‌ దానంతట అదే బ్లాక్‌ అవుతుంది. తరువాత మనమిచ్చిన ఫోన్‌ నెంబరుకు మెసేజ్‌ వస్తుంది. దాని ఆధారంగా పోలీసులు ఈ పోర్టల్‌ ద్వారా చరవాణి ఎక్కడ ఉంది అనేది కనుక్కొని బాధితులకు అందజేస్తున్నారు.


41 శాతం రికవరీ

సీఈఐఆర్‌ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన అనంతరం ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంగా పోగొట్టుకున్న/చోరీ అయిన చరవాణులను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందించారు. ఉమ్మడి జిల్లాలో పోగొట్టుకున్న/చోరీ అయిన చరవాణులు మొత్తం 6,831 ఉండగా వీటిలో 2,805(41.06 శాతం) ఫోన్లను పోలీసులు ఆ పోర్టల్‌ ద్వారా గుర్తించారు.


మొదటి స్థానంలో రామగుండం

సీఈఐఆర్‌ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన అనంతరం ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల(రామగుండం కమిషనరేట్) పరిధిలో మొత్తం 55.78 శాతం చరవాణులను పోలీసులు రికవరీ చేశారు. రెండో స్థానంలో ఆదిలాబాద్‌ జిల్లాలో 35.70 శాతం ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. మూడో స్థానంలో నిర్మల్‌లో 30.55 శాతం చరవాణులు రికవరీ కాగా కుమురం భీం జిల్లాలో 21.15 శాతం ఫోన్లు గుర్తించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని