logo

ఆర్జీయూకేటీలో విద్యార్థులకు అస్వస్థత?

నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో బుధవారం పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. కానీ ఈ విషయాన్ని ఆర్జీయూకేటీ అధికారులు బయటకు రానీయ్యడం లేదు.

Published : 01 Dec 2022 05:48 IST

విషయం బయటకు చెప్పని అధికారులు

ముథోల్‌, (బాసర), న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో బుధవారం పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. కానీ ఈ విషయాన్ని ఆర్జీయూకేటీ అధికారులు బయటకు రానీయ్యడం లేదు. బుధవారం మధ్యాహ్నం అన్ని భోజనశాలలో విద్యార్థులకు చికెన్‌ వడ్డించారు. అది తిన్నాక ఒక్కసారిగా పలువురు విద్యార్థులు కడుపునొప్పి, ఇతర కారణాలతో ఆసుపత్రికి వెళ్లారు. అధిక సంఖ్యలో వెళ్లిన విషయం తెలుసుకున్న డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ నేరుగా ఆసుపత్రి వెళ్లి విద్యార్థులను పరామర్శించినట్లు సమాచారం. సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, కడుపునొప్పి తదితర సమస్యలతో విద్యార్థులు హెల్త్‌ సెంటర్‌కు వెళ్తూ ఉంటారని ఆర్జీయూకేటీ మీడియా వాట్సాప్‌ గ్రూప్‌లో పీఆర్వో పోస్టు చేశారు. అసత్య ప్రచారాలని నమ్మవద్దని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని