గానం.. నటన.. కఠోర సాధన
నిరంతర శ్రమ.. కఠోర సాధన.. పలువురి ప్రోత్సాహం.. స్నేహితుల సహకారంతో గానం.. నటనలతో గ్రామీణ నేపథ్యాన్ని బుల్లి తెరపైకెక్కిస్తూ దూసుకుపోతున్నారు కుంటాల గ్రామానికి చెందిన ప్యాదరి గజ్జారాం-పోశాని దంపతుల కుమారుడు ప్యాదరి మహేందర్.
బహుముఖ ప్రజ్ఞాశాలి మహేందర్
స్టూడియోలో పాట పాడుతున్న మహేందర్
కుంటాల, న్యూస్‌టుడే: నిరంతర శ్రమ.. కఠోర సాధన.. పలువురి ప్రోత్సాహం.. స్నేహితుల సహకారంతో గానం.. నటనలతో గ్రామీణ నేపథ్యాన్ని బుల్లి తెరపైకెక్కిస్తూ దూసుకుపోతున్నారు కుంటాల గ్రామానికి చెందిన ప్యాదరి గజ్జారాం-పోశాని దంపతుల కుమారుడు ప్యాదరి మహేందర్. తన గొంతుకు, హావాభావాలను జోడించి ప్రజలను నవ్వుల్లో ముంచుతూ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. తన నటనతో అందరిని మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. స్థానిక పాఠశాలలో ప్రైవేటు ఉపాధ్యాయుడిగానే కొనసాగుతూ ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు.
స్నేహితుల సహకారంతో
కుంటాల గ్రామానికి చెందిన సినీ, బుల్లితెర నటుడు, గాయకుడు తాటి శివ, తెలుగు పండితుడు ముజ్గి రవి కుమార్ (అంబకంటి), సింధే శ్రీకాంత్ (అర్లి(కె)), అన్వేష్ (భైంసా)లు మహేందర్ అభిరుచి మేరకు పాటలు రచన చేస్తుంటారు. అయితే శివ గజ్జలమ్మ ఆడియో పాట రూపకల్పన చేసేందుకు ముందుగా పాటల పోటీలు నిర్వహించారు. అందులో ఉత్తమంగా పాడిన మహేందర్‌ను ఎంపిక చేసి ప్రోత్సహించారు. అయితే ఇప్పటి వరకు గ్రామీణ, ఆధ్యాత్మిక, కులవృత్తులు, ఇతరత్రా పాటలు సుమారుగా 50కిపైగా పాడి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆర్థికంగా భారమైనా లఘు చిత్రాలు, పాటలు, చక్కటి జానపద గీతాలకు రూపకల్పన చేస్తూ ఆలోచింపజేస్తారు. చదువుకునే రోజుల్లోనే వేదికలపై ప్రసంగంతోపాటు పాటలు పాడుతూ అందరిని అలరించేవారు. ఇదే క్రమంలో పాటలు పాడటం, నటనను అలవాటుగా మార్చుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని రాజ సూడ్డియోలో గజ్జలమ్మ ఆడియో పాట రికార్డింగ్‌ను మధుప్రియతో కలిసి ఆలపించారు. పాటలకు ట్యూన్ చేస్తూ స్వయంగా పాడటం నేర్చుకున్నారు. రక్తి కట్టించే పాటలు పాడుతూ గొంతుకకు పదును పెట్టారు. ముందు పాటలు పాడటానికే ప్రాధాన్యం ఇచ్చారు. అప్పుడే పలువురు నటులతో నటనపై పట్టుసాధించి సఫలీకృతుడయ్యారు. ముందుగా కుంటాలలోని ప్రసిద్ధ గజ్జలమ్మ ఆలయ విశిష్టతలను తెలియజేస్తూ పాటల సీడీని రూపొందించారు. ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డితోపాటు ప్రముఖులతో గజ్జలమ్మ, ఇతరత్రా సీడీలను ఆవిష్కరించారు.
కుంటాలలో గజ్జలమ్మ సీడీని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
ఆలపించిన గేయాలు
కురుమల జీవన విధానం, ఐక్యత, జైభీమ్, గోమాత, అంబకంటి అంజన్న, సిరాల శివుడు, షిర్డీ, కల్లూరు సాయిబాబా, కదిలి పాపహరేశ్వరాలయం, కుంటాల ప్రాచీన శ్రీకృష్ణదేవాలయం చరిత్రను తెలుపుతూ అనేక పాటలు, ఛాయా చిత్రాలు తీశారు. భైంసా పట్టణానికి చెందిన కొత్తూరు శంకర్ నిర్మాత, దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ప్రేమ లొల్లి’ సినిమాలో తాను పాడిన ‘లవ్ ఫెయిల్యూర్’ పాట ద్వారా వెండితెరపైకెక్కనుందని గర్వంగా చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ పలు పాటలను సైతం హైదరాబాద్ సూడ్డియోలో కళాకారుల ఆధ్వర్యంలో రూపొందించారు. వివిధ వేషధారణలో పలువురు కళాకారులతో మండలంలోని ఆయా గ్రామాల్లో పాటలను చిత్రీకరించి ఔరా అనిపించారు. ఆధ్యాత్మిక పాటలను విన్న ప్రతి ఒక్కరూ శెభాష్ అంటూ ప్రత్యేకంగా అభినందించడం తమవంతవుతుంది. ప్రభుత్వం కళా రంగంలోని ప్రతి పౌరుడిని పోత్సహించాలి. ప్రతిభ గల వారిని గుర్తిస్తే భావితరాలకు సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య