logo

భాజపాలో చేరడం అదృష్టంగా భావిస్తున్నా

భారాసలోని కేంద్రీకృత విధానాల వల్ల ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తనకు గడిచిన రెండు నెలల 25 రోజులు ప్రశాంతత లేకపోవడంతోపాటు  అవహేళనకు గురయ్యానని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు బోర్లకుంట వెంకటేశ్‌నేత పేర్కొన్నారు.

Published : 01 May 2024 02:36 IST

 పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత 

మాట్లాడుతున్న ఎంపీ వెంకటేశ్‌నేత

మంచిర్యాలఅర్బన్‌, న్యూస్‌టుడే: భారాసలోని కేంద్రీకృత విధానాల వల్ల ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తనకు గడిచిన రెండు నెలల 25 రోజులు ప్రశాంతత లేకపోవడంతోపాటు  అవహేళనకు గురయ్యానని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు బోర్లకుంట వెంకటేశ్‌నేత పేర్కొన్నారు. ఇటీవల భాజపాలో చేరిన ఆయన తొలిసారి మంగళవారం మంచిర్యాలకు వచ్చారు. భాజపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రూప్‌- 1 అధికారిగా 11 సంవత్సరాలు సేవలు అందించిన తనకు మరో 19 సంవత్సరాల సర్వీస్‌ ఉన్నప్పటికీ జిల్లాకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. దేశ పరిరక్షణ కోసం ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేయాలని భాజపాలో చేరినట్లు ఆయన తెలిపారు. భాజపాలో చేరడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఏ పదవి కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. జిల్లాలోని అన్ని రంగాలకు సేవ చేయాలన్నదే తన కల అని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌లో తాత, తండ్రి, మనవడు పాలనకు అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌, నాయకులు రజనీష్‌జైన్‌, తుల ఆంజనేయులు, పట్టి వెంకటకృష్ణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని