logo

ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు కృషి

జిల్లా రైతులు పండిస్తున్న సేంద్రియ ఉత్పత్తుల కోసం స్థానికంగా ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

Published : 01 May 2024 02:39 IST

 రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

కిసాన్‌మేళాలో స్టాళ్లు పరిశీలిస్తున్న మంత్రి, ఎమ్మెల్యేలు

మంచిర్యాల గ్రామీణం, పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా రైతులు పండిస్తున్న సేంద్రియ ఉత్పత్తుల కోసం స్థానికంగా ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్‌లో హాజీపూర్‌ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కిసాన్‌మేళాను ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్‌లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  ఏటా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో భూసార పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో మామిడి మార్కెటింగ్‌కు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. సేంద్రియ ఉత్పత్తులను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌, యాప్‌ను రూపొందించాలని మల్లికార్జున్‌రెడ్డి అనే రైతుకు సూచించారు. దీనికోసం ప్రభుత్వం తగిన సహాయం చేస్తుందని తెలిపారు. చేనేత కార్మికుల కోసం ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. టీ-శాట్‌ ఛానల్‌ ద్వారా సేంద్రియ ఉత్పత్తులపై తగిన సలహాలు, సూచనలను రైతులకు అందించేలా కృషిచేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ రైతులు వరితో పాటు కంది, పెసర, శనగ, కూరగాయలు పండించాలన్నారు. ఎమ్మెల్యే వివేక్‌ మాట్లాడుతూ రైతులు సేంద్రియ పంటలు పండించేలా ప్రభుత్వమే అవగాహన సదస్సులు నిర్వహించి మరిన్ని రాయితీలు ప్రకటించాలని కోరారు. అనంతరం 22 రకాల సేంద్రియ ఉత్పత్తుల స్టాళ్లను మంత్రి, ఎమ్మెల్యేలు పరిశీలించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ ఉప్పలయ్య, వైస్‌ ఛైర్మన్‌ సల్లం మహేష్‌, కౌన్సిలర్‌ మహేశ్వరి, జడ్పీటీసీ సభ్యురాలు శిల్ప, ఎఫ్‌పీవో సలహాదారుడు గోనె శ్యామ్‌సుందర్‌రావు, డైరెక్టర్లు పూస్కూరి శ్రీనివాస్‌రావు, బొడ్డు శంకర్‌, బొలిశెట్టి తిరుపతి, రైతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని