logo

పార్టీని విమర్శించే అర్హత వారికి లేదు

జనసేన పార్టీని, నేతలను విమర్శించే హక్కు పార్టీని విడిచి వెళ్లిన నాయకులకు లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్‌ అన్నారు.

Published : 28 Mar 2024 02:15 IST

సమావేశంలో మాట్లాడుతున్న శివదత్‌ తదితరులు

నక్కపల్లి, న్యూస్‌టుడే: జనసేన పార్టీని, నేతలను విమర్శించే హక్కు పార్టీని విడిచి వెళ్లిన నాయకులకు లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్‌ అన్నారు. నక్కపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీశివకుమారి కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలోకి చేరారన్నారు. రెండు మూడు రోజులు ఇందులో తిరిగి, ఇప్పుడు వైకాపా కండువా వేసుకున్నారని విమర్శించారు. ఇక్కడకు మీరు వచ్చి ఏం చేశారని, ప్రజల తరఫున ఏ పోరాటం చేశారని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ ఏనాడు సీట్ల విషయంలో హామీలు ఇవ్వలేదని పేర్కొన్నారు. నచ్చకపోతే పార్టీని వీడి వెళ్లొచ్చని, దీనికోసం లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తే సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైదీల పార్టీలో ఉంటూ శివకుమారితోపాటు శేషుకుమారి, సరోజ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎంపీటీసీ సభ్యుడు ఆకేటి గోవిందరావు, పాము గణేష్‌, బంగారి రాజు, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని