logo

విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌ కోరారు.

Updated : 18 Apr 2024 04:51 IST

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్‌ వేయనున్నట్లు పేర్కొన్నారు. సభల్లో రాళ్లు వేసుకోవడం, కోడికత్తి వంటి డ్రామాలతో ఓట్లు వస్తాయని వైకాపా నాయకులు భావిస్తున్నారన్నారు. ఇలాంటి పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులు తీసుకువచ్చానని, తాను పార్లమెంట్‌ సభ్యునిగా గెలిస్తే స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తానన్నారు. గాజువాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయినా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తానన్నారు.  తమ పార్టీ టికెట్ల కోసం మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దించుతామన్నారు. అంతకుముందు ఆయన ఎన్నికల ప్రచార గీతం విడుదల చేశారు. నాయకులు యేసు పాదం, రవికుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని