Anand Mahindra: ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్‌ మహీంద్రా

Anand Mahindra: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా తాజాగా మరో వీడియో పోస్ట్‌ చేశారు.

Updated : 01 May 2024 09:34 IST

Anand Mahindra | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నో ఆసక్తికర విషయాలు, ప్రేరణ కలిగించే వీడియోలను తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా పంచుకుంటుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). తాజాగా ఆయన ఓ చిన్నారి సేవాగుణం, కృతజ్ఞతాభావానికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. స్ఫూర్తిదాయకంగా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

చక్రాల కుర్చీలో ఉన్న ఓ వ్యక్తిని రోడ్డు దాటేందుకు సాయం చేసిన ఓ బాలిక.. ఇందుకు సహకరించిన వాహనదారులకు మర్యాదపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ‘‘ప్రపంచం మొత్తం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది’’ అంటూ ఆనంద్‌ మహీంద్రా ఆ పోస్టుకు క్యాప్షన్ జోడించారు.

లండన్‌లోనూ డబ్బావాలా ఎఫెక్ట్‌: ఆనంద్‌ మహీంద్రా

ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘ఇలాంటి క్షణాలే.. ఈ అందమైన ప్రపంచాన్ని మనకు గుర్తుచేస్తాయి’’ అని ఒకరు స్పందించారు. ‘‘పిల్లలకు ఇటువంటి మానవీయ విలువలు నేర్పించాలి’’ అని మరొకరు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని