logo

ఏజెన్సీలో వేసవి తాపం

మైదాన ప్రాంతాలకు దీటుగా ఈ సారి ఏజెన్సీ ప్రాంతంలోనూ వేసవి తాపం గట్టిగానే చూపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా ఏజెన్సీలో ప్రధాన కేంద్రాలైన పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Published : 20 Apr 2024 01:57 IST

పాడేరు పట్టణం: మైదాన ప్రాంతాలకు దీటుగా ఈ సారి ఏజెన్సీ ప్రాంతంలోనూ వేసవి తాపం గట్టిగానే చూపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా ఏజెన్సీలో ప్రధాన కేంద్రాలైన పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరులో అరకొరగా ఉన్న రక్షిత పథకాల్లో నీరు ఇంకిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. రేకుల కాలనీ వాసులు రాత్రి వేళలో టార్చిలైట్ల వెలుతురులో నీటిని తోడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో భవిష్యత్తులో తాగునీటికి ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో నని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్కూళ్లకు వచ్చే పిల్లలు ఉదయం 11 దాటాక ఎండ వేడిమి తాళలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో పాడేరు పట్టణంలో ఓ బైక్‌ దగ్ధమైన సంగతి విదితమే. గతానికి భిన్నంగా ఏజెన్సీ వాతావరణం వేడెక్కడంతో స్థానికులు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


మోతుగూడెం, న్యూస్‌టుడే: చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పరిధిలోని పొల్లూరు ఎగువ, దిగువ జలపాతాల అందాలు మండు వేసవిలో సైతం సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. కొండలపై నుంచి పాల నురగలా కిందకు జాలువారుతూ కనువిందు చేస్తున్నాయి. పర్యటకులు, స్థానికులు ఈ అందాలను ఆస్వాదిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని