logo

అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!

పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది.

Published : 26 Apr 2024 01:54 IST

కొత్త జిల్లాతో ప్రయోజనం శూన్యం 

తాగునీటి కష్టాలు

చింతపల్లి, న్యూస్‌టుడే : పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. ఇంతకాలం అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న అనేక గ్రామాలు కొత్త జిల్లా ఏర్పాటుతో బాగుపడతాయని అంతా భావించారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక పరమైన ఎన్నో మార్పులు ఉంటాయని అనుకున్నారు. ఉపాధి, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిపాలన, మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, రాజకీయం వంటి అనేక రంగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని భావించినా రెండేళ్లలో ఈ మార్పులేవీ కనిపించలేదు.

గిరిజన పల్లెల్లో అనేక సమస్యలు మండల వ్యవస్థ కారణంగా వెలుగులోకి వచ్చాయి.  అంతకు ముందు రెండు, మూడు మండలాలు కలిపి ఒక సమితిగా ఉండేవి. ఎన్టీఆర్‌ హయాంలో ఏర్పడిన మండలాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, సంక్షేమ ఆశ్రమాలతోపాటు కస్తూర్బా విద్యాలయాలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలు ఏర్పడ్డాయి. నేటికీ గిరిజన గ్రామాల్లో సమస్యలన్నీ యథాతథంగానే ఉన్నాయి. గుక్కెడు తాగునీటి కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి. సాగునీటి సదుపాయాలు, రహదారులు, రవాణా వ్యవస్థలు లేవు. ఒక్కోసారి అత్యవసర వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. కొత్త జిల్లాలో ఉన్నతాధికారులు అందుబాటులో ఉండి, పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని అంతా భావించారు. జిల్లా ఏర్పడక ముందు పరిస్థితి ఎలా ఉందో.. ఇప్పుడూ అదే పరిస్థితని కొంతమంది పెదవి విరుస్తున్నారు.

డోలీమోతలే దిక్కా..!

జిల్లా ముఖచిత్రం ఇదీ..

  •  విస్తీర్ణం: 12,253 చ.కి.మీటర్లు
  •  రెవెన్యూ గ్రామాలు:  2972
  •  గ్రామ పంచాయతీలు: 430
  •  2021 నాటికి జనాభా: సుమారు 12లక్షలు (అంచనా)
  •  అక్షరాస్యత శాతం: 48.34 శాతం
  •  అటవీ విస్తీర్ణం :7,76,141 హెక్టార్లు

    రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలి

చింతపల్లిని రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా చేయాలి. లేదంటే ఐటీడీఏనైనా ఇక్కడ ఏర్పాటు చేయాలి. వీటి ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగే అవకాశం ఉంది. పరిపాలనాపరమైన సౌలభ్యం పెరగడం వల్ల అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. గిరిపల్లెల్లో మౌలిక వసతులు సమకూరే అవకాశం ఉంది.

-గడుతూరి రాంగోపాల్‌, అఖిల భారత ఆదివాసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని