logo

ప్రజల ఆస్తులను దోచుకోవడానికే జగనన్న భూ యాజమాన్య చట్టం

ప్రజల సొంత ఆస్తులను దోచుకోడానికి జగనన్న భూ యాజమాన్య హక్కుల చట్టం తీసుకొచ్చారని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు.

Published : 01 May 2024 01:42 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ప్రజల సొంత ఆస్తులను దోచుకోడానికి జగనన్న భూ యాజమాన్య హక్కుల చట్టం తీసుకొచ్చారని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. మంగళవారం రాత్రి ఆయన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అమలు కాని చట్టంపై చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ ఆరోపణలు చేస్తున్నారని వైకాపా నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ చట్టాన్ని 2023 అక్టోబరు31 నుంచి అమలు చేస్తున్నట్లు జీఓ 512 విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. చట్టాన్ని అనుసరించి సివిల్‌ కోర్డులో కేసులు తీసుకోవడం మానేశారన్నారు. చట్టాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు నిరసన దీక్షలు చేశారని తెలిపారు. మాజీ ఐఏఎస్‌ అధికారి అజయ్‌కల్లాం లాంటి వ్యక్తులతో అబద్ధాలు చెప్పిస్తుండటం దారుణమన్నారు. జీఓను రద్దు చేయకుండా చట్టం అమలుచేయడం లేదని ఎలా అంటారని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని