logo

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం ప్రమాదానికి గురైంది.

Published : 08 May 2024 01:44 IST

త్రుటిలో తప్పిన పెనుప్రమాదం

చింతపల్లి నర్సీపట్నం మార్గంలో కొలపరి వద్ద వర్షానికి రోడ్డు పక్కకు ఒరిగిపోయిన బస్సు

చింతపల్లి/గ్రామీణం, న్యూస్‌టుడే: చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం ప్రమాదానికి గురైంది. కొలపరి సమీపంలో అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి రహదారి అంచున ఉన్న మట్టి జారి బస్సు అదుపు తప్పింది. ఒరిగిపోయిన బస్సులో నుంచి ప్రయాణికులంతా హడావుడిగా కిందికి దిగిపోవడంతో ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం చింతపల్లి మీదుగా లంబసింగి వరకు 516-ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా కొన్ని చోట్ల రహదారి విస్తరణతోపాటు మరికొన్ని చోట్ల మట్టిని తవ్వి చదును చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో బురద చేరింది. ఈనేపథ్యంలోనే ఈ టూ స్టాప్‌ బస్సు ప్రమాదానికి గురైంది. నిర్మాణ పనులు చేపడుతున్న సిబ్బంది పొక్లెయిన్‌ సాయంతో బస్సును రోడ్డుపైకి చేర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని