logo

వైకాపా ఖాళీ అయిపోయింది: మండలి

వైకాపా మొత్తం ఖాళీ అయిందని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీకీ రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు.

Published : 28 Apr 2024 03:55 IST

అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి, ఘంటసాల, చల్లపల్లి, న్యూస్‌టుడే: వైకాపా మొత్తం ఖాళీ అయిందని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీకీ రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తథ్యమన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మే 6న అవనిగడ్డ వస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్‌ తెలిపారు. గుడివాక శేషుబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాగాయలంకలో తెదేపా జిల్లా నాయకుడు, రాష్ట్ర సంప్రదాయ మత్స్యకారుల సేవా సమితి ప్రధాన కార్యదర్శి లకనం నాగాంజనేయులు, మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మండవ బాలవర్థిరావు మత్స్యకారుల కాలనీలో తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని