logo

జిల్లా బాడీ బిల్డర్ల సత్తా

అనపర్తిలో ఈ నెల 26న జరిగిన సెంట్రల్‌ జోన్‌ అంతర్‌ జిల్లాల బాడీ బిల్డింగ్‌ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన బిల్డర్లు సత్తా చాటి పతకాలు కైవసం చేసుకున్నారని జిల్లా బాడీ బిల్డింగ్‌, ఫిట్‌నెస్‌ సంఘం ప్రధాన కార్యదర్శి టి.అశోక్‌ తెలిపారు.

Published : 29 Jun 2022 04:51 IST


పతకాలు సాధించిన క్రీడాకారులతో సీఐ గోవిందరాజు, ఈదా రాజేష్‌, అశోక్‌, శిక్షకులు, మేనేజర్లు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: అనపర్తిలో ఈ నెల 26న జరిగిన సెంట్రల్‌ జోన్‌ అంతర్‌ జిల్లాల బాడీ బిల్డింగ్‌ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన బిల్డర్లు సత్తా చాటి పతకాలు కైవసం చేసుకున్నారని జిల్లా బాడీ బిల్డింగ్‌, ఫిట్‌నెస్‌ సంఘం ప్రధాన కార్యదర్శి టి.అశోక్‌ తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు మంగళవారం కానూరులోని అశోక్‌ జిమ్‌లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి పెనమలూరు సీఐ ఆర్‌.గోవిందరాజు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలను అభినందించారు. 65 కేజీల కేటగిరీలో ఎం.నారాయణరావు (ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌), 80 కేజీల కేటగిరీలో పి.గోపి రజతం, ఏఎం ఆలీ కాంస్య పతకాలు కైవసం చేసుకోగా.. 70 కేజీల కేటగిరీలో వై.శ్రీకాంత్‌, 75 కేజీల కేటగిరీలో పి.అప్పన్నలు అయిదో స్థానంలో నిలిచారు. కార్యక్రమానికి జిల్లా బాడీ బిల్డింగ్‌, ఫిట్‌నెస్‌ సంఘం అధ్యక్షుడు ఈదా రాజేష్‌ అధ్యక్షత వహించగా, కార్మిక సంఘం నాయకులు యార్లగడ్డ శ్రీను, టి.విజయ్‌, జిమ్‌ మాస్టర్లు పి.దుర్గారావు, వెంకట్‌, జట్టు మేనేజర్‌ ఎస్‌కే ఖాదర్‌, జట్టు బాధ్యుడు అల్లూరి రెడ్డి, కోచ్‌ కె.కొండలు, జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి టి.అశోక్‌ పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని