logo

వైభవంగా మన్యుసూక్త హోమం

విశ్వశాంతికోసం చేపట్టిన శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు మన్యుసూక్త హోమాన్ని ఆదివారం మచిలీపట్నంలోని హిందూకళాశాల ప్రాంగణంలో వైభవంగా ప్రారంభించారు.

Published : 05 Dec 2022 05:35 IST

ఊరేగింపులో రామానుజ జీయర్‌స్వామి, భక్తులు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: విశ్వశాంతికోసం చేపట్టిన శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు మన్యుసూక్త హోమాన్ని ఆదివారం మచిలీపట్నంలోని హిందూకళాశాల ప్రాంగణంలో వైభవంగా ప్రారంభించారు. ఉదయం త్రిదండి అష్టాక్షరీ సంపత్‌కుమార రామానుజ జీయర్‌ స్వామి హాజరై పలువురు వేదపండితులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీరాముడు, వెంకటేశ్వరస్వామి పలువురు దేవతామూర్తుల విగ్రహాలను అశ్వవాహనంపై ఉంచి నగరంలో ఊరేగించారు. రుత్వికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. దేవతామూర్తుల ప్రతిమలను ప్రధాన యాగశాలకు తీసుకెళ్లి అంకురార్పణ పూజలు చేశారు. ఈ నెల 9వ తేదీ వరకు యాగాలు జరుగుతాయి. నిర్వాహకులు దేసు అన్నపూర్ణమ్మ, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాదు, కమిటీ సభ్యులు, వాలంటీర్లు, భక్తులు పాల్గొన్నారు. ప్రతి రోజూ ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు హోమం జరుగుతుందని నిర్వాహకులు వివరించారు.

యాగశాలకు దేవతామూర్తుల విగ్రహాలను తీసుకెళ్తున్న పండితులు, భక్తులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని