logo

గుమ్మం వద్దకే ఆర్టీసీ కార్గో సేవలు

ఏపీఎస్‌ ఆర్టీసీ లాజిస్టిక్స్‌లో బుక్‌ చేసిన పార్శిల్‌, కొరియర్‌లను షిప్‌మంత్ర ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా వినియోగదారుల గుమ్మం వద్దకే వెళ్లి డెలివరీ ఇస్తామని, అలాగే సేకరిస్తామని విజయవాడ జోన్‌-2 ఈడీ గిడుగు వెంకటేశ్వరరావు తెలిపారు.

Published : 25 Mar 2023 04:14 IST

విజయవాడ బస్టేషన్‌, న్యూస్‌టుడే : ఏపీఎస్‌ ఆర్టీసీ లాజిస్టిక్స్‌లో బుక్‌ చేసిన పార్శిల్‌, కొరియర్‌లను షిప్‌మంత్ర ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా వినియోగదారుల గుమ్మం వద్దకే వెళ్లి డెలివరీ ఇస్తామని, అలాగే సేకరిస్తామని విజయవాడ జోన్‌-2 ఈడీ గిడుగు వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఈడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లో సరకు రవాణాను మొదటిసారిగా 1985లో ఒప్పంద పద్ధతిలో ఏఎన్‌ఎల్‌ పార్శిల్‌ సర్వీస్‌ ద్వారా ప్రారంభించామన్నారు. 2017 నుంచి ఆర్టీసీ సొంతంగా  పార్శిల్‌, కొరియర్‌ సేవలు ప్రారంభించిందన్నారు. 2017-18లో రోజుకు సగటు బుకింగ్‌లు 8 వేలు కాగా ప్రస్తుత బుకింగ్‌లు 25 వేలకు పెరిగాయన్నారు. 2015-16లో ఏఎన్‌ఎల్‌ రూ. 9 కోట్లు సంస్థకు చెల్లిస్తే, ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే  2017-18లో రూ. 58.57 కోట్ల ఆదాయం పొందిందన్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో లాజిస్టిక్స్‌ ద్వారా రూ.163 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆయన వివరించారు. వినియోగదారులు ఇంటి వద్దే సంబంధిత వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి డోర్‌ పికప్‌, డెలివరీ సౌకర్యం పొందవచ్చన్నారు. ఈ సేవలు 50 కిలోల వరకు  పార్శిల్స్‌ 20 కిమీ పరిధిలో పొందవచ్చన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని