logo

రైల్వే సరకు రవాణాలో రికార్డు ఆదాయం

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ సరకు రవాణాలో రికార్డు స్థాయి ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36.2 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది.

Published : 28 Mar 2024 05:49 IST

డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్‌తో సీనియర్‌ డీసీఎం రాంబాబు

విజయవాడ (రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ సరకు రవాణాలో రికార్డు స్థాయి ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36.2 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది మార్చి 16వ తేదీ నాటికి రూ.3975 కోట్ల ఆదాయం సమకూరింది. గతంతో పోలిస్తే డివిజన్‌ ఆదాయం గణనీయంగా పెరిగింది. 8 శాతం వృద్ధితో నెలవారీ సగటు సరకు రవాణా ఆదాయం రూ.331 కోట్లుగా నమోదు చేసుకుంది. డివిజన్‌ చరిత్రలో రూ.5500 కోట్ల లక్ష్యాన్ని అధిగమించేందుకు ముందుకు సాగుతోంది. ఆదాయం పరంగా ఎప్పటి మాదిగిగా అదానీ పోర్ట్‌ మొదటి స్థానంలో ఉండగా.. కాకినాడ పోర్ట్‌ రెండో స్థానంలో నిలిచింది. సరకు రవాణాలో ప్రధానంగా బొగ్గు, ఎరువుల ద్వారా అత్యధిక ఆదాయం సమకూరింది. లోకల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్‌ బృందాల చర్చలు, అందుబాటులో రేక్‌లు, ట్రాఫిక్‌ అనుకూలత డివిజన్‌ సరకు రవాణా ఆదాయం పెరిగేందుకు దోహదపడింది. కొత్తగా కలప, లేటరైట్‌ లోడింగ్‌లు చేయడం వల్ల కూడా ఇందుకు దోహదపడింది. అలాగే డివిజన్‌ వ్యాప్తంగా రూ.153 కోట్ల వ్యయంతో 15 గూడ్స్‌షెడ్ల ఆధునికీకరణపై విజయవాడ డివిజన్‌ దృష్టి సారించింది. అన్నవరం వద్ద కాకినాడ గేట్‌వే పోర్ట్‌, మచిలీపట్నం ఓడరేవు, రామాయణపట్నంతో పాటు మరో మూడు పోర్టులకు కనెక్టివిటీ పెంచారు. డివిజన్‌ ఆదాయం పెంపులో కీలకపాత్ర పోషించిన విజయవాడ సీనియర్‌ డీసీఎం వి.రాంబాబు, సీనియర్‌ డీవోఎం డి.నరేంద్రవర్మలను డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని