icon icon icon
icon icon icon

YS Sharmila: ప్రత్యేక హోదా కోసం జగన్‌ ఒక్క ఉద్యమమైనా చేశారా?: వైఎస్‌ షర్మిల

రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

Published : 27 Apr 2024 11:24 IST

పాయకరావుపేట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని విమర్శించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలనే ఆలోచన పాలకులకు ఉందా అని నిలదీశారు.

‘‘అధికారంలోకి వచ్చాక జగన్‌ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లు ఎందుకు వేయాలి? రైతులకు అన్యాయం జరగుతుంటే సీఎం ఏం చేస్తున్నారు? మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ ఇచ్చారు. ఎన్నికలకు 2 నెలల సమయం ఉందన్నప్పుడే గుర్తొచ్చిందా? కుంభకర్ణుడు ఆరు నెలలే నిద్రపోతాడు. మీరు ఐదేళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు లేచారా? సిద్ధమంటూ బయల్దేరారు.. దేనికి అప్పులు చేయడానికా? మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగనన్నారు. ఇప్పుడు సర్కారే లిక్కర్ అమ్ముతోంది. నాసిరకం మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారు’’ అని షర్మిల మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img