logo

28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు

మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.

Published : 23 Apr 2024 06:06 IST

మచిలీపట్నం వైకాపా ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి నామినేషన్‌

కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు. మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానానికి వైకాపా అభ్యర్థ్ధిగా డా. సింహాద్రి చంద్రశేఖర్‌తో పాటు బహుజన సమాజ్‌పార్టీ అభ్యర్థిగా దేవరపల్లి దేవమణి, స్వతంత్ర అభ్యర్థిగా గూడవల్లి వెంకట కేదారేశ్వరరావులు రిటర్నింగ్‌ అధికారైన కలెక్టర్‌ డీకే బాలాజీకి నామపత్రాలు సమర్పించారు. గుడివాడ అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా వెనిగండ్ల రాము నామినేషన్‌ వేయగా వైకాపా తరఫున కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) రెండు సెట్లు, కొడాలి నాగేశ్వరరావు రెండు సెట్ల నామపత్రాలు ఇచ్చారు. రేమల్లి నీలకాంత్‌ స్వతంత్ర అభ్యర్థిగా, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా నల్లగంచు వెంకటరాంబాబు, జైభారత్‌ నేషనల్‌ పార్టీ నుంచి అల్లూరి హేమంత్‌కుమార్‌లు నామినేషన్లు అందజేశారు. గన్నవరం అసెంబ్లీ స్థానానికి జైభీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ తరఫున కలపర్తి భాస్కరరావు, స్వతంత్ర అభ్యర్థిగా కొర్రపోలు శ్రీనివాసరావులు, పెనమలూరు అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థులుగా పచ్చిపాల కనకదుర్గారావు, గోగం రాము, బహుజనసమాజ్‌ పార్టీ సోము మహేశ్వరరావులు నామపత్రాలు ఇచ్చారు. అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి కూటమికి చెందిన జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్‌ రెండు సెట్ల నామపత్రాలు ఇచ్చారు. పామర్రు అసెంబ్లీకి వైకాపా అభ్యర్థులుగా కైలే అనిల్‌కుమార్‌, కైలే జ్ఞానమణి, బహుజన సమాజ్‌పార్టీ నుంచి రాయవరపు బాబూరాజేంద్రప్రసాద్‌లు, పెడన అసెంబ్లీకి తెదేపా అభ్యర్థులుగా కాగిత కృష్ణప్రసాద్‌, కాగిత శిరీష, బహుజన సమాజ్‌పార్టీ నుంచి ఈడే కాశీవిశ్వేశ్వరరావు, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా శొంటి నాగరాజు, స్వతంత్ర అభ్యర్థులుగా రాజులపాటి జమదగ్ని, సేనాపతి గోపిలు నామినేషన్లు వేశారు. మచిలీపట్నం అసెంబ్లీకి వైకాపా అభ్యర్థిగా పేర్ని కిట్టూ, బహుజనసమాజ్‌ పార్టీ నుంచి సౌదాడ బాలాజీ, భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా కోన నాగార్జున, స్వతంత్ర అభ్యర్థిగా సీహెచ్‌ మనోహర్‌లు నామపత్రాలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని