logo

పదిలో అద్భుత ప్రతిభ

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు.

Published : 23 Apr 2024 06:31 IST

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. నగరపాలక సంస్థ పాఠశాలల్లో విద్యాభ్యాసం సాగిస్తున్న ఇద్దరు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి అధికారుల మన్ననలు పొందారు.  

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవుతా...

భవానీశంకర్‌కు మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు

సత్యనారాయణపురం: మధురానగర్‌ పసుపుతోటకు చెందిన భవానీశంకర్‌... దుర్గాపురంలోని ఎస్టీవీఆర్‌ నగర పాలక సంస్థ పాఠశాలలో పదో తరగతి చదివాడు. ఫలితాల్లో ప్రతిభ చూపి 594/600 మార్కులు సాధించాడు. తండ్రి నాగరాజు విద్యుత్తు పనులు చేస్తుంటారు. తల్లి జగదీశ్వరి గృహిణి. ప్రతిరోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం రెండు గంటలు పాటు కష్టపడి చదివినట్లు భవానీశంకర్‌ తెలిపాడు. ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించానని, భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవుతానని ‘న్యూస్‌టుడే’తో తెలిపాడు. తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించి, మిఠాయిలు తినిపించారు.

పేదింట విద్యాకుసుమం

సువర్షిత

పటమట, న్యూస్‌టుడే:  గోవింద రాజుల ఈనాం ట్రస్ట్‌(జీడీఈటీ) మున్సిపల్‌ పాఠశాల పదో తరగతి విద్యార్థిని గాడెల్లి సువర్షిత 594 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. తండ్రి నాగరెడ్డిబాబు ఆటో డ్రైవర్‌, తల్లి బేబి సరోజని గృహిణి. వారికి ముగ్గురు కూతుళ్లు. పటమటకు చెందిన నాగిరెడ్డి.. తన ముగ్గురు కుమార్తెలను మగ పిల్లలకంటే దీటుగా పెంచారు. ఆటో నడుపుకొంటూ వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. పెద్ద కుమార్తె సువర్షిత 594 మార్కులు సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. సివిల్స్‌ సాధించడమే తన లక్ష్యమని సువర్షిత చెప్పింది.

చుట్టుగుంట: విజయవాడకు చెందిన విద్యార్థిని కమలినీ రాజ్‌ 597 మార్కులు సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని