logo

పదిలో.. మళ్లీ పదకొండే

పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా..

Published : 23 Apr 2024 06:47 IST

రాష్ట్రంలోని 10 జిల్లాల కంటే వెనుకంజ
ఈసారి కూడా బాలికలదే పైచేయి

ఈనాడు, అమరావతి - ఈనాడు డిజిటల్‌, మచిలీపట్నం: పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాలతో పోల్చి చూస్తే.. ఇప్పటికీ 10 జిల్లాల కంటే వెనుకంజలోనే ఉన్నాం. 2019 వరకూ ఉమ్మడి జిల్లాలో ఏటా 90శాతానికి పైగా ఉత్తీర్ణత వచ్చేది. కొవిడ్‌లో రెండేళ్లు పది పరీక్షలను నిర్వహించలేదు. ఆ తర్వాత 2022లో నిర్వహించిన ఫలితాల్లో ఉమ్మడి జిల్లా గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా పది ఫలితాల్లో పతనమైంది. ఏటేటా కొద్దిగా మెరుగుపరుచుకుంటూ వచ్చిన ఉత్తీర్ణత శాతం.. మళ్లీ ఈ ఏడాది 90శాతాన్ని దాటగలిగాం.

  • జిల్లాలో ఈ ఏడాది 21,112 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 19,011 (90.05శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. 2101 మంది తప్పారు. ఈ ఏడాది కూడా ఉత్తీర్ణతలో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. 11,138మంది బాలురు పరీక్షకు హాజరవ్వగా.. 9,833 మంది (88.28 శాతం) పాసయ్యారు. 9,974మంది బాలికలు పరీక్షలు రాయగా.. 9,178 మంది (92.02 శాతం) ఉత్తీర్ణులయ్యారు.  

15,396 మందికి ప్రథమ శ్రేణి..

కృష్ణా జిల్లాలో ఉత్తీర్ణులైన 19,011మందిలో ఈ ఏడాది 60శాతానికి పైగా మార్కులు తెచ్చుకుని ప్రథమ శ్రేణి సాధించిన వాళ్లు 15,396 మంది. మిగతా వారిలో 50-60 శాతం మధ్య మార్కులతో ద్వితీయ శ్రేణి సాధించిన విద్యార్థులు 2,381మంది ఉన్నారు. 50శాతం కంటే తక్కువ మార్కులతో ద్వితీయ శ్రేణి వచ్చిన విద్యార్థులు 1,234మంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని