logo

యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన.. పట్టించుకోని అధికారులు

నందిగామలో నిబంధనలకు విరుద్ధంగా ప్రతి ఇంటికి వైకాపా స్టిక్కర్లు అంటిస్తున్నా... ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదు.

Published : 08 May 2024 04:18 IST

నందిగామ, న్యూస్‌టుడే: నందిగామలో నిబంధనలకు విరుద్ధంగా ప్రతి ఇంటికి వైకాపా స్టిక్కర్లు అంటిస్తున్నా... ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రత్యేకంగా కొందరు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని వార్డుల వారీగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రంతో కూడిన సిద్ధం స్టిక్కర్లను ఇళ్లకు అంటిస్తున్నారు. కొన్ని రోజులుగా యథేచ్ఛగా ఆ పని వేస్తున్నా.. మున్సిపాలిటీ, ఎన్నికల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాగానే అన్ని రాజకీయ పార్టీల జెండాలు, ఫ్లెక్సీలు తొలగించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతోంది. ఇటువంటి సమయంలో వైకాపా నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. స్టిక్కర్లు అతికిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు ఫిర్యాదు చేసినా అధికారులకు కనీసం స్పందించట్లేదు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎ. రవీంద్రరావును సంప్రదించగా.. ఇళ్లకు పార్టీల స్టిక్కర్లు అంటించకూడదని చెప్పారు. వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. వేసిన స్టిక్కర్లు తొలగించమని కమిషనర్‌ను ఆదేశిస్తామన్నారు. బాధ్యులపై కేసులు పెడతామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని